ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా, సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా , మలయాళ నటుడు ఫాహాద్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలల్ కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

కానీ ఆ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ బృందం ఫుల్ కూల్ గా ఈ సినిమా యొక్క షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్ మరియు మరి కొంత మంది పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఆ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించి ఉండడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని మారుస్తూ వెళ్లడంతో ఈ మూవీ పై అంచనాలు తగ్గే అవకాశం కూడా చాలా వరకు ఉంది. మరి ఈసారైనా ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల అవుతుందో లేక మరోసారి పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa