ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ లు జరుపుకున్న టాప్ 10 తెలుగు మూవీలు ఏవి. అందులో కల్కి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 450 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏ డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 2 వ స్థానంలో ఉంది. ఈ సినిమాను రేపు అనగా జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 352 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 3 వ స్థానంలో నిలవగా , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో 4 వ స్థానంలో నిలిచింది.


ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 5 వ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ సినిమా 240 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 6 వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రభాస్ హీరోగా రూపొందిన రాదే శ్యామ్ సినిమా 202.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 7 వ స్థానంలో నిలవగా , ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 187.25 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ తో 8 వ స్థానంలోనూ , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప మూవీ 144.9 కోట్ల రిలీజ్ బిజినెస్ తో 9 వ స్థానంలోనూ , మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం మూవీ 132 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో 10 వ స్థానంలోనూ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: