ఈ మధ్య కాలంలో ఏదైనా స్టార్ హీరో సినిమా వచ్చింది అంటే చాలు నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతూ వస్తున్నాయి. అలాగే సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే నైజాం ఏరియాలో అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి. దానితో డిస్ట్రిబ్యూటర్స్ కూడా నైజాం ఏరియాలో క్రేజ్ ఉన్న సినిమాలకు ఎక్కువ డబ్బులు పెట్టి కొనడానికి పెద్దగా ఏమీ వెనకాడడం లేదు. దానితో ఈ మధ్య కాలంలో విడుదల అయిన చాలా సినిమాలను నైజాం ఏరియాలో భారీ ధరలు పెట్టి అనేక డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనుగోలు చేశాయి.

ఇకపోతే కొంతకాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు విడుదలకు ముందు ఉన్నాయి. దానితో ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఏకంగా 70 కోట్ల భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మూవీ కి హిట్ టాక్ రావడంతో అవలీలగా ఈ మూవీ నైజాం ఏరియాలో 70 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ రేపు అనగా జూన్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి కూడా నైజాం ఏరియాలో ఏకంగా 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 70 కోట్ల ప్రియ రిలీజ్ బిజినెస్ అనేది నైజాం ఏరియాలో చాలా పెద్ద విషయమే. దానితో కల్కి సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే అవలీలగా 70 కోట్ల షేర్ కలెక్షన్లను నైజాం ఏరియాలో రాబట్ట కలుగుతుంది. ఒక వేళ హిట్ టాక్ రాకపోతే ఈ సినిమాకు 70 కోట్లు నైజాం ఏరియాలో రావడం కాస్త కష్టమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: