తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో రామ్ పోతినేని ఒకరు.  ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. అందులో భాగంగా చివరగా ఈ నటుడు ది వారియర్, స్కంద అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలే. భారీ అంచనాల నడుమ ఈ సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాయి.

దానితో ఈ మూవీల ద్వారా ఈ నటుడికి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిలింది. మళ్లీ కూడా ఈ నటుడు ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీల వైపే ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తీసుకువచ్చింది లవ్ ప్లేస్ యాక్షన్ ఫిలిమ్స్. ఈయన దేవదాసు మూవీతో వెండితెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా పక్క లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది.

మూవీ తర్వాత రామ్ "రెడీ" మూవీతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కూడా ఫ్యామిలీ ప్లేస్ క్లాస్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందింది. అలాగే ఈ నటుడు కందిరీగ మూవీతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కూడా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందింది. ఇకపోతే ఈ నటుడు ఈస్మార్ట్ శంకర్ అనే ఒకే ఒక్క మాస్ కమర్షియల్ విజయాన్ని అనుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా డబల్ ఈస్మార్ట్ మూవీలో  హీరోగా నటిస్తున్నాడు. ఏదేమైనా కూడా రామ్ ను ఎక్కువ మంది ఆడియన్స్ క్లాస్, లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలలో చూడడానికే ఇష్టపడతారు. అలాంటి మూవీల ద్వారానే ఈయనకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: