టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సీనియర్ స్టార్ హీరో అయినటువంటి నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం   ఈ రెండు సినిమాల షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయి. మూవీ బృందాలు ఈ మూవీ కి సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర మూవీ లో నాగార్జున అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ముంబైలో నాగార్జున , ధనుష్ పై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విశ్వంభర మరియు కుబేర మూవీలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: