అల్లు శిరీష్ కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న బడ్డీ సినిమాకు నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం బడ్డీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బడ్డీ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తన తండ్రి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌పై అల్లు శిరీష్ ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. "లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా అని అడిగారు. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా" అని ఓటీటీలో ఇదివరకే ఇలాంటి సినిమా ఉన్నదానిపై అల్లు శిరీష్ సమాధానం చెప్పారు.

"బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ, బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది" అని అల్లు శిరీష్ తెలిపారు."డైరెక్టర్ శామ్ గారి 100 అనే సినిమా చూసి చాలా బాగా చేశాడే అనుకున్నా. అలాగే శామ్ గారి ట్రిగ్గర్ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న అథర్వతో యాక్షన్ మూవీ చేశాడు అనుకున్నా. నేను శామ్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అన్నా. అలా బడ్డీతో మా కాంబో కుదిరింది" అని దర్శకుడితో ఉన్న అనుబంధాన్ని అల్లు శిరీష్ చెప్పారు.

"ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా. నా హీరోయిజం చూపించాలని కాదు. జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్ గారు" అని నిర్మాత, తండ్రి అల్లు అరవింద్‌పై అల్లు శిరీష్ కామెంట్స్ చేశారు.అలాగే బడ్డీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి కూడా అల్లు శిరీష్ పలు కామెంట్స్ చేశారు. "పుష్ప 2 మూవీ గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి" అని అల్లు శిరీష్ పేర్కొన్నారు. దీంతో అల్లు శిరీష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: