మృణాల్ ఠాకూర్ హిందీ సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఈమె నటించిన సీరియల్స్ మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన జెర్సీ సినిమాను హిందీ లో జెర్సీ అనే టైటిల్ తోనే గౌతమ్ తిన్ననూరి , షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించాడు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగు వైపు ప్రయాణించింది.

అందులో భాగంగా ఈ బ్యూటీ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాల తాకిడి పెరిగింది. అందులో భాగంగా ఈ బ్యూటీ ఇప్పటికే నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సీత రామం సినిమా తర్వాత ఈమెకు వరుసగా మంచి సినిమా అవకాశాలే వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత మాత్రం ఈమెకు ఏ పెద్ద సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు రావడం లేదు. మరి ఈ ముద్దు గుమ్మ సెలెక్టెడ్ గా సినిమాలు చేయడం కోసమే మూవీలను రిజెక్ట్ చేస్తుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. దానితో కొంత కాలం వెయిట్ చేసినా ఈమెకు మంచి అవకాశాలే దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mt