ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమాలలో నటించి తనకంటూ నటుడుగా సూపర్ గుర్తింపును సంపాదించుకున్న వారిలో విక్రమ్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన ఆయన ఏ సినిమాలో అయినా కమర్షియల్ హంగులకంటే కూడా తన పాత్రలో నటించడానికి స్కోప్ ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు. అందులో భాగంగానే ఇప్పటికే ఈయన ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగాలమ్ అనే సినిమాలో విక్రమ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే నిజంగానే ఈ సినిమా కనుక ఆగస్టు 15 వ తేదీన విడుదల అయినట్లయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టడం కష్టమే అవుతుంది.

ఎందుకు అంటే ఈ తేదీన రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ సినిమా విడుదల కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ ఈస్మార్ట్ శంకర్ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతూ ఉండటంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఒక వేళ ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే అదే తేదీన తంగాలమ్ విడుదల అయిన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: