నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుండి కష్టపడుతున్నారు డైరెక్టర్. ఈ కథను రాసుకోవడానికి తనకి దాదాపుగా ఐదేళ్లకు పైగానే సమయం పట్టింది అని ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో తెలిపాడు అశ్విన్. దాదాపుగా మూడేళ్లపాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఇదివరకే ట్రైలర్ విడుదల చేయగా కల్కి సినిమా ఎలా ఉంటుందో అని అందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు

 .ట్రైలర్ వచ్చి కొన్ని ప్రశ్నలకు జవాబును అందించింది. కల్కి అవుట్ అండ్ అవుట్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతోంది అని ఈ కథకి మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చారు అని కల్కి భవిష్యత్తులో వస్తాడు అని ఆయన వచ్చేనాటికి ప్రపంచం ఎలా ఉంటుందో దాన్ని ఈ సినిమాలో చూపించాను అని ఇటీవల సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్లో తెలిపాడు డైరెక్టర్. ఇకపోతే యూఎస్ లో ఈ సినిమా వసూళ్లు దంచి కొట్టింది. యూఎస్ ఆడియన్స్ కలిగి సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూశారు. దీని వసూళ్లు చూస్తేనే అర్థమవుతుంది

 రికార్డ్ స్థాయిలో కల్కి టికెట్స్ ఏ స్థాయి లో అమ్ముడుపోయాయో. అంతేకాదు  రికార్డు స్థాయిలో కల్కి టికెట్స్ లక్ష యాభై వేలకు పైగా అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ $ 3 మిలియన్ దాటిపోయాయి. కల్కి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను కల్కి చాలా ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు.  కల్కి చిత్రం జూన్ 27న విడుదల అవుతుంది. ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, శోభన వంటి స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ కేటాయించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: