పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడానికి సిద్ధంగా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసనా దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే వాళ్లతో పాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి వాళ్ళందరూ పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కేవలం భారత దేశంలోనే కాకుండా

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల ఐ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దానికి తగ్గట్లుగానే చిత్ర బృందం సైతం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన  కల్కి నుండి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందనను

 అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు... తాజాగా నార్త్ అమెరికాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా  కు సంబంధించి రిలీజ్ వరకే ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడుపోయాయంటే.. అక్కడ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం కెనడాలో ఐమాక్స్ స్క్రీనింగ్ లతో సమస్యలు వచ్చినట్లు కనపడుతుంది. హిందీ వర్షన్ కోసం 15 కంటే ఎక్కువ ఐమాక్స్ షోలు ఊహించిన విధంగా రద్దు అయ్యాయి. ఇందుకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మెసేజ్ల రూపంలో సమాచారాన్ని అందజేశారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా తరఫున చాలామంది అభిమానులు షేర్ చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: