పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ను అందుకుందో తెలిసిందే. సౌత్ లోనే కాకుండా ఈ అమ్మడు నార్త్ లో కూడా "యానిమల్" సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది. దానితో ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా రష్మిక నటిస్తున్న పుష్ప2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్లు  జరుగుతున్నాయి. ఇక ఆ సమయంలోనే ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన అభిమానులను భయపెట్టేందుకు బాలీవుడ్

 నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఓ హార్రర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుందట రష్మిక. కాగా దర్శకుడు ఆదిత్య స‌త్పోద‌ర్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేశారట. దానితో ఈ ప్రాజెక్టుకి రష్మిక మందన్నను కన్ఫామ్  చేశారట మేకర్స్. ఇక ఈ మూవీ ను స్త్రీ, భేడియా, ముంజ్యా వంటి హారర్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాత దినేష్ విజయ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతే కాకుండా రష్మిక మందన్న ఎప్పుడు చూడని పాత్రలో ఈ చిత్రం ద్వారా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

కాగా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న  మొట్టమొదటిసారిగా అలరించేందుకు తేర మీదకి వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీకి "వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అంతే కాకుండా ఈ స్క్రిప్ట్ చాలా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ చేస్తారట. ఇక రష్మిక మందన ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప: ది రూల్’.  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సినీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ‘పుష్ప2’ను తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: