కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా కుబేర. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమలా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ధనుష్ కెరియర్ లో 51వ సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ షూటింగ్ విజువల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్

 అవుతున్నాయి.  అయితే కొన్ని రోజులుగా ధనుష్ నాగార్జున రష్మిక మందనలకి సంబంధించిన షూటింగా ముంబైలో జరుపుతున్నారు. జుహు బీచ్ లో ప్రస్తుతం ధనుష్ కి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా వాటికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతున్నాయి. అలాగే షూటింగ్ పూర్తయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ నుండి తిరిగి హైదరాబాద్ కి వస్తున్న ఫోటోలు కూడా నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ధనుష్ కి సంబంధించిన పలు సన్నివేశాలను

 చిత్రీకరించినప్పటికీ గత కొన్ని రోజుల క్రితం ముంబైలో రష్మిక మందన కి సంబంధించిన పలికి సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఇప్పుడు హైదరాబాదులో అక్కినేని నాగార్జున ధనుష్ లకి మధ్య జరిగే పలు ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తో చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్‌ కుబేర ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: