పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ మూవీని నాగ్ అశ్విన్ రూపొందించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీత నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. ఏక కాల్ కి విడుదలకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే టికెట్ స్ అందుబాటులోకి వచ్చాయి.

ఫ్యాన్స్ ప్రభాస్ను చూడటం కోసం టికెట్లను హాట్ కేకుల్లాగా కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎంత డబ్బు నైనా ఖర్చు పెడుతున్నారు. అయితే కల్కి రెడీస్ కు ఒక రోజు సమయం మాత్రమే ఉండడంతో టికెట్స్ దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు తమ దగ్గర కల్కి టికెట్లు ఉన్నాయని జనాలను నమ్మించి మోసం చేస్తున్నారు. బ్లాక్ టికెట్స్ ఇంతకు ముందు థియేటర్స్ ముందు అమ్మేవారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటి నుంచి సోషల్ మీడియాలోనే పెట్టేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. టికెట్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు పంపించాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం వంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే కొన్నిసార్లు టికెట్ ఇచ్చినప్పటికీ దీనిపై ఉండే బార్కోడ్ ఉండడం లేదు. లేదా అదే టికెట్ ఇతరులకు కూడా అమ్మేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఇటువంటి మోసాలు భారీగా జరుగుతున్నాయి. అలా కల్కి టికెట్స్ విషయంలోనూ జరుగుతున్నాయి. మీరు కనుక కల్కి టికెట్లను కొనుగోలు చేయాలి అనుకుంటే వాటిపై ఉన్న బార్కోడ్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు కొనుగోలు చేయండి. ఇక రేపు విడుదల కానున్న కల్కి మూవీ ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఏక కాల్ కి విడుదలకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: