1996లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాను తెరకెక్కించారు.   కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయి జూలై 12 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సమయంలో మూవీ టీమ్ అంతా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కమల్ హాసన్ ఇలా మాట్లాడుతూ..... "అవినీతి విషయంలో అందరి మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే అప్పట్లో వచ్చిన భారతీయుడు పార్ట్ వన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి

 మార్పు రాలేదు. ఇక ఈ సినిమా మొత్తం అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కించారు  . ఈ సినిమా చూశాక అయినా చాలామంది ఆలోచిస్తారు. నేను గతంలో నటించిన కొన్ని సినిమాల్లోని పాత్రలతో పోలిక ఉండడంతో భారతీయుడు సినిమాలో భాగం కావాలని నేను అనుకోలేదు. అందుకనే శంకర్ తనంతట తానుగా నన్ను ఈ సినిమా నుంచి తప్పించాలని నేను కావాలనే నా రెమ్యూనరేషన్ ను పెంచాను. కానీ నేను అంతా రెమ్యూనరేషన్ అడిగినప్పటికీ కూడా నిర్మాతలు నా డిమాండ్ ని అంగీకరించడంతో నేను ఆ సినిమాలో నటించాను. ముఖ్యంగా

 చెప్పాలంటే శంకర్ కు తన కథపై చాలా నమ్మకం ఎక్కువ. దానితో భారతీయుడు 2 సినిమా నాతోనే తీయాలని పట్టుబడి తీశారు. దాంతో ఆయన పట్టుదలని చూసిన నేను ఆశ్చర్యపోయాను. తనను ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు నా కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.ఇదిలా ఉంటే  భారతీయుడు సినిమా మూడు భాగాలుగా ఎందుకు చేశారు అనే విషయం పై దర్శకుడు శంకర్  ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు.  భారతీయుడు మొదటి భాగం ఒక సెట్లో జరిగే కథ. ఇది 3:20 గంటల నిడివి. కాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  తాజాగా ఇప్పుడు వస్తున్న భారతీయుడు 2 సినిమా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కథ.  

మరింత సమాచారం తెలుసుకోండి: