ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలకు సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా కల్కి సినిమాకు కూడా సూపర్ రిలీజ్ బిజినెస్ ఈ ఏరియాలో జరిగింది. కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీడెడ్ ఏరియాలో 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇప్పటి వరకు సీడెడ్ ఏరియాలో ఇదే హైయెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్. ఈ మూవీ కి ఈ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సమయంలో హిట్ టాక్ రానట్లు అయితే ఈ సినిమాకు ఈ ఏరియాలో పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ టాక్ ను తెచ్చుకొని 37 కోట్లకు మించిన షేర్ కలక్షన్ లను ఈ ఏరియాలో వసులు చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇకపోతే రేపు అనగా జూన్ 27 వ తేదీన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా విడుదల కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ కి సీడెడ్ ఏరియాలో ఏకంగా 27 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ ఏరియాలో 27 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అనేది చాలా పెద్ద విషయం. ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా కల్కి సీడెడ్ ఏరియాలో రికార్డు సృష్టించింది. మరి ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు అయితే ఈ ఏరియాలో భారీ మొత్తంలో కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది. మరి కల్కి సినిమా ఈ ఏరియాలో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: