రష్మిక మందన కన్నడ సినిమా అయినటువంటి కిరీక్ పార్టీ మూవీతో మంచి విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు కన్నడలో క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగింది. దానితో ఈమె కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె మాత్రం కన్నడ సినిమా పరిశ్రమలో కంటిన్యూ కాకుండా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె నటించిన మొదటి తెలుగు సినిమా ఛలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది.

దానితోనే ఈమె క్రేజ్ తెలుగులో పెరిగింది. ఆ తర్వాత గీత గోవిందం విజయం సాధించడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈమె నటించిన మరికొన్ని సినిమాలు కూడా తెలుగులో విజయం సాధించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమెకు తమిళ, హిందీ సినిమాల నుండి అవకాశాలు రావడం మొదలు అయింది.

అందులో భాగంగా ఇప్పటికే ఈమె తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ సరసన వారిసు అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే మరికొన్ని తమిళ సినిమాలలో కూడా ఈ బ్యూటీ నటించింది. ఇక ప్రస్తుతం వరుస పెట్టి హిందీ సినిమాలలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే యానిమల్ మూవీతో హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ అనే మరో హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

తాజాగా ఈ నటి మరో తమిళ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందబోయే 24వ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈమె కన్నడ సినీ పరిశ్రమ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ప్రస్తుతం మాత్రం తన ఇంట్రెస్ట్ ను కన్నడ సినిమాలపై కాకుండా తెలుగు, తమిళ, హిందీ సినిమాలపై చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: