యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ హీరోగా సూపర్ స్టార్ డంతో ముందుకు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఇప్పటిదాకా తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టాడు కానీ ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టలేదనే విషయం చాలామందికి తెలియదు. అదేంటి ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్టే కదా అంటే.. కంప్లీట్ గా కాదు.. ఒక్క తెలుగు రాష్ట్రల్లోనే బాహుబలిని దాటింది తప్ప ఓవరాల్ గా టోటల్ వసూళ్లు చూస్తే బాహుబలికి ఆమడ దూరంలో ఉంది. పైగా అది మల్టీ స్టారర్.. అది కూడా రాజమౌళికే క్రెడిట్ ఎక్కువ దక్కుతుంది. టైర్ వన్ హీరో అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ హిట్ అయినా ఉండాలి. ఇప్పటి జనరేషన్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ మాత్రమే ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. మరి ఎన్టీఆర్ కు ఇప్పటి దాకా ఒక్కటి కూడా ఇండస్ట్రీ హీట్ అయితే దక్కలేదు.ఇక దేవర సినిమాతో ఏమైనా దక్కుతుందా అనేది చూడాలి. ఇండస్ట్రీ హిట్ లేకున్నా కానీ మహేష్, పవన్, ప్రభాస్, రామ్ చరణ్ తరువాత టైర్ 5 లో ఎన్టీఆర్ నిలిచాడు.


అయితే ఆయన  ఆ ఒక్క మిస్టేక్ చేయకపోయి ఉంటే ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగే వాడు అంటూ కొంతమంది సినీ విమర్శకులు ఆయన మీద విమర్శలైతే చేస్తుంటారు. కెరియర్ మొదట్లోనే ఈయన ఎక్కువగా ఓన్లీ భారీ మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక స్టార్టింగ్ లోనే తన టాలెంట్ మొత్తాన్ని చూపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఏం సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదాని మీద క్లారిటీ లేకుండా పోవడంతో ఆయన కొద్ది వరకు మధ్యలో తడబడ్డాడు. ఆ క్రమంలో మధ్యలో చాలా ప్లాప్స్ కూడా ఎదురుకున్నాడు. టాప్ లెవల్లో ఎన్టీయార్ ని చూసి మాస్ హీరోగా అలవాటు పడిన ఆడియన్స్ కి ఆ తరువాత ఆయన ఎలాంటి సినిమాలు చేసిన  నచ్చలేదు. ఇక మొదట్లోనే ఆయన కనక కొంచెం డీసెంట్ సినిమాలు ఇంకా లవ్ స్టోరీస్ ని చేసుకుంటూ వచ్చి తర్వాత మాస్ హీరోగా ఎదిగితే ఆయన ఖచ్చితంగా 2010 కి ముందే ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉండేవారు. చాలా మంది సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు కానీ.. కాదు కేవలం బ్లాక్ బస్టర్ మూవీ మాత్రమే.. ఇక దేవరతో ఇండస్ట్రీ హిట్ కొడతాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా రెండు పాటల షూటింగ్ జరుపుకుంటుంది. అవి కూడా మంచి డాన్స్ నెంబర్స్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: