రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ గా ఉంది.హాలీవుడ్‌ సినిమాని తలపించే రేంజ్ లో ఈ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్ రూపొందించాడు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ బాక్సాఫీస్ వద్దే కాకుండా విదేశాల్లో కూడా వసూళ్ల రికార్డ్‌ లు నమోదు అవ్వడం ఖాయం అనే నమ్మకం ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతుంది. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ పట్టణాలు ఇంకా నగరాల్లో కల్కి సినిమాను భారీ ఎత్తున స్క్రీనింగ్‌ చేసేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కెనడాలోని ఐమాక్స్ స్క్రీనింగ్‌ సమస్య తలెత్తింది అంటూ సమాచారం తెలుస్తుంది. కల్కి హిందీ వర్షన్ ను చూసేందుకు కెనడా ఐమాక్స్ లో టికెట్స్ బుక్‌ చేసిన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈమెయిల్స్ ద్వారా వారి షో క్యాన్సిల్‌ అయినట్లుగా వారికి మెసేజ్ లు అందాయట. 


టెక్నికల్‌ ఇష్యూ కారణంగా మొత్తం 15 హిందీ వర్షన్ షో లను ఐమాక్స్ క్యాన్సిల్‌ చేయడం జరిగిందని సమాచారం తెలుస్తుంది. సినిమా టికెట్లు క్యాన్సిల్‌ అయిన వారు సోషల్ మీడియా ద్వారా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర దేశాల్లోని ఐమాక్స్ ల్లో కల్కి షో లు యధావిధిగా సాగుతాయని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి కల్కి 2898 ఏడి సినిమాని మొదటి రోజు చూడాలని కోరుకున్న కెనడా సినీ అభిమానులకి మాత్రం పెద్ద షాక్ తగిలి చివరకి నిరాశ మిగిలింది. ప్రస్తుతం పెద్ద పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో దీపికా పదుకునే ఇంకా అలాగే దిశా పటానీ లు హీరోయిన్స్ గా నటించారు.సీనియర్ హీరోలు అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటించారు. అలాగే నాని, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు గెస్ట్ రోల్‌ లో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ అందులో క్లారిటీ లేదు. ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: