మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ వారిలో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకోగలిగారు. వారిలో సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కూడా ఒకరు. సుప్రీం మూవీతో హీరో సాయి ధరం తేజ్ ఇండస్ట్రీకి రియంట్రీ ఇచ్చాడు. ఏక తన కొత్త చిత్రాన్ని రీసెంట్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీను రోహిత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తుండగా తేజ్ ఖరీదులో 18వ చిత్రంగా ఇది రాబోతుంది.

ఇక ఈ మూవీను అనౌన్స్ చేయగానే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు లో వేసిన స్పెషల్ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కథ 1947 నేపథ్యంలో సాగుతున్నట్లుగా టాప్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీకు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. " సంబరాల ఏటి గట్టు " అనే టైటిల్ను హి మూవీకి పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా కథకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం పరిశీలించిందట. మరి నిజంగానే తేజ్ సినిమాకు ఇటువంటి టైటిల్ ఫిక్స్ చేశారా అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్సిడెంట్ నుంచి కోల్కున్న అనంతరం విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సాయి ధరం సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సూపర్ హిట్ మూవీ అనంతరం ఈ హీరో చేస్తున్న తదుపరి చిత్రమే ఈ మూవీ. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే గతంలో లాగా ఈయన క్రేజ్ ఇండస్ట్రీలో మారు మోగుతుంది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: