ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీకల్కి 2898 AD”..టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.. రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కిలో ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు...

సినిమా ట్రైలర్ లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు.కల్కి సినిమా కథ భారతీయ పురాణాలకు క్లైమాక్స్ వంటిది అని నాగ్ అశ్విన్ తెలిపిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అమితాబ్ అశ్వద్దామ పాత్రలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ కల్కిగా కనిపించునున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో తన పాత్రలో  నెగటివ్ షేడ్స్ కూడా ఉండనున్నట్లు ఇటీవల ప్రభాస్ తెలిపిన సంగతి తెలిసిందే..ఇదిలా ఉంటే తాజాగా కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.. దీనితో కల్కి టికెట్స్ కోసం భారీగా డిమాండ్ పెరిగింది.కల్కి మూవీ టికెట్స్ కోసం తనకు చాలా కాలం తరువాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేసారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: