సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే వారితో ఖచ్చితంగా ఫోటోలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటారు. నిజంగా కనిపిస్తే వారితో ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు? అందులోనూ తమ అభిమాన తార కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఒక్క సెల్ఫీ అంటూ వారి వెంటపడతారు. ఫోటో క్లిక్‌ మనిపించే అవకాశం ఇస్తే అలాగే జీవితాంతం గుర్తుంచుకుంటారు.కానీ ఆ తారల పక్కన ఉన్న బాడీగార్డులు మాత్రం అభిమానులను హీరోల దగ్గరకు కూడా రానివ్వరు. ఇంకా సెల్ఫీలు, వీడియోలని అడిగితే మాత్రం నిర్దాక్షిణ్యంగా అభిమానులని అవతలకు నెట్టేస్తారు. ఇలాంటివి అన్ని మనం గతంలోనే చూస్తూ ఉంటాము.మొన్న ఈ మధ్య టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్‌ నాగార్జున అభిమానికి ఇలాంటి చేదు అనుభవమే ఒకటి ఎదురైంది. ఎయిర్‌పోర్టులో దిగిన నాగ్‌ను చూసిన ఓ అభిమాని సెల్ఫీ అంటూ ముందుకొచ్చాడు. అయితే అతన్ని కనీసం పెద్దాయన అని కూడా చూడకుండా నాగ్‌ బాడీ గార్డ్‌ ఆయనను గట్టిగా పక్కకి తోసేశాడు. 


దీంతో కిందపడబోయిన ఆయన తమాయించుకుని వెంటనే నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారగా అందుకు నాగర్జున ఆయనకి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కూడా చెప్పాడు. తాను అదంతా కూడా గమనించలేదని, ఇంకోసారి ఇలాంటిది జరగనివ్వనని అతనికి మాటిచ్చాడు.అయితే తాజాగా మరోసారి ఎయిర్‌పోర్టుకు వెళ్లిన నాగర్జున అక్కడే ఉన్న తన అభిమానిని పలకరించడం జరిగింది. అంతేగాక అతనికి హగ్గిచ్చి సెల్ఫీ కూడా దిగాడు. మొన్న జరిగిన దాంట్లో నీ తప్పు లేదు.. మా వాళ్లే తప్పుగా ప్రవర్తించారని చెప్పి నాగార్జున అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇక ఈ వీడియోని చూసిన నాగార్జున అభిమానులు.. అక్కడున్నది మా కింగ్‌ నాగార్జున రియల్ కింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ కూడా హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: