కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దారుణమైన నిజాలు బయటకి వస్తున్నాయి.అతనిపై అత్యంతపాశవికంగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.ఇంతవరకూ అతడిపై కేవలం దాడి మాత్రమే జరిగిందనుకున్నారు కానీ విచారణలో విస్తు పోయే నిజాలు బయట పడుతున్నాయి.రేణుకాస్వామిపై అత్యంత కృరంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. అతిడి మర్మాంగంతో పాటు, చెవులు, దవడ కోసేసి చిత్ర హింసలకు గురిచేసినట్లు సమాచారం తెలుస్తోంది.అతడి మృతదేహానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట బాగా వైరల్ అవ్వడంతో ఈ విషయం లీకైంది. వాటిని చూడటానికి తెగ నెటిజనులు భయపడుతున్నారు. దీంతో మరోసారి నెట్టింట నెటిజనులు దర్శన్ పై తీవ్ర అగ్రహానికి గురవుతున్నారు. అంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారంటూ మండిపడుతున్నారు.


 రాక్షసుల్లా దర్శన్ ఇంకా అతని గ్యాంగ్ దాడికి తెగబడినట్లు మండిపడుతున్నారు. రాక్షసులంటూ ఉంటే? అది మీలాగే ఉంటారంటూ నెటి జనుల కోపం కట్టలు తెంచుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.తెలిసో? తెలియకో తప్పు చేస్తే లీగల్ గా చర్యలు తీసుకోవాలి కానీ మరీ రౌడీల్లా ఇంత దారుణమైన చర్యలకు పాల్పడటం పెద్ద పాపం. ఇలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా స్వయంగా దర్శన్ చేయించాడా? అతడు మనుషులు చేసారా? ఏది ఏమైనా ఇలాంటి ఆలోచన అనేది మనిషికి ఉండే లక్షణం కాదని పూర్తిగా సైకో ప్రవర్తనలా ఉందని నెటిజన్స్ మండిపడుతున్నారు.ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన హీరో దర్శన్, పవిత్రాగౌడ్ పరప్పన్ అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లతో పాటు మరో 15 మందికి పైగా కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా దాడిలో ఎవరైనా భాగమయ్యారా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక మరోవైపు దర్శన్ ని ఎలాగైన బెయిల్ పై బయటకు తీసుకురావాలని అతడి లాయర్ల బృందం కొన్ని రోజుల నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: