యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీకల్కి 2898 AD”..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.. రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు... ఈ సినిమా ట్రైలర్ లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

సినిమా చూస్తున్నంత సేపు మరో లోకంలోకి వచ్చామా అని ప్రేక్షకులు అనుభూతి చెందుతారని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కల్కి టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్స్ రేటు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చాయి. దీనితో కల్కి సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. దీనిని బట్టి కల్కి క్రేజ్ ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఊహించని సర్ప్రైజెస్ ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ,దుల్కర్ సల్మాన్ స్పెషల్ క్యారెక్టర్స్ చేసినట్లు తాజాగా నిర్వహించిన ఇన్స్టా లైవ్ లో హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేసారు. అంతేకాదు ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం. సినిమా చూసే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ పక్కా అని మేకర్స్ చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: