రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ భైరవ పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ విడుదలైంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమాతో మరోమారు మ్యాజిక్ చేశారు. సినిమాలో చిన్నచిన్న మైనస్ లు ఉన్నా ప్రభాస్ అభిమానులు మాత్రం సాహోరే నాగ్ అశ్విన్ అని కామెంట్లు చేస్తున్నారు.
 
నాగ్ అశ్విన్ కృషి, ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. నాగ్ అశ్విన్ తన ఊహలను కల్కి 2898 ఏడీ రూపంలో తెరపైకి తెచ్చి వావ్ అనిపించారు. 600 కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం ఖర్చైనా సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో ఆ కష్టం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నాగ్ అశ్విన్ ఐదేళ్ల కష్టానికి కల్కి సినిమా రూపంలో కోరుకున్న ప్రతిఫలం దక్కినట్టేనని చెప్పవచ్చు.
 
38 సంవత్సరాల వయస్సులోనే నాగ్ అశ్విన్ కల్కి అనే అద్భుతమైన సినిమాను తెరకెక్కించి సత్తా చాటారు. హాలీవుడ్ కు పోటీనిచ్చే స్థాయిలో కాదు హాలీవుడ్ నే మించేలా సినిమా తీయగల సత్తా భారతీయ దర్శకులకు ఉందని ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పేశారు. నాగ్ అశ్విన్ కన్న కలలకు ప్రభాస్, అమితాబ్, దీపిక జీవం పోశారనే చెప్పాలి. ఇకపై ప్రభాస్ గురించి మాట్లాడే ప్రేక్షకులు కల్కి ముందు కల్కి తర్వాత ప్రభాస్ కెరీర్ అంటూ మాట్లాడుకుంటారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
కల్కి 2898 ఏడీలో బుజ్జి అనే కారు ప్రత్యేకతల గురించి, ఆ కారుకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ గురించి ఎంత ప్రశంసించినా తప్పు లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి నాగ్ అశ్విన్ రూపంలో మరో అద్భుతమైన దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు. ఫస్ట్ పార్ట్ తో మ్యాజిక్ చేసిన నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్ తో అంతకు మించి మెప్పిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: