రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ నగరంలో స్టార్ హీరో సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు పెద్ద మొత్తంలో ఆ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ ఏరియా నుండి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏ డి సినిమా విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ నగర అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి.

ఇక ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో హైదరాబాద్ నగరంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో టికెట్స్ బుకింగ్స్ అయ్యాయి. దానితో ఈ మూవీ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు హైదరాబాద్ నగరంలో మొదటి రోజుకు సంబంధించి ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 18.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఏ సినిమాకు ఈ స్థాయిలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్షన్లు రాలేదు.

సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా 12.5 కోట్లతో 2 వ స్థానంలో ఉండగా , ఆ తర్వాత రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 10.5 కోట్లతో 3 వ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ 9.5 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలోనూ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 9.1 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: