ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు దర్శకులు హీరోలు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కల్కి 2898 ఏడి మూవీ. నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. కాగా ఇప్పటికీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కూడా పూర్తయ్యాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే అటు సోషల్ మీడియా రివ్యూ చూసుకుంటే కల్కి మూవీ అదిరిపోయిందని.. ఇది ఒక విజువల్ వండర్ అంటూ ఎంతో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి అని చెప్పాలి.


 కాగా ఇండియాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అయితే అంతకుముందే అటు థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఎంత సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ప్రతి థియేటర్ వద్ద ప్రభాస్ కు సంబంధించిన భారీ కటౌట్లు వెలిశాయి. అయితే ఇక ఈ మూవీలో విజువల్ వండర్స్ అదిరిపోయాయి అంటూ ఇప్పుడిప్పుడే పబ్లిక్ టాక్ బయటకు వస్తుంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని లాంటి స్టార్లు కూడా కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వారి పాత్రలు కూడా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాయి.


 ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఇంత మంది స్టార్స్ నటించగా దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఏ స్టార్ నటించిన పాత్ర ఫేవరెట్ అన్న విషయం కూడా వైరల్ గా మారిపోయింది. ఇంకేముంది ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర అటు నాగ్ అశ్విన్ కు ఫేవరెట్ అయి ఉంటుందని అందరూ అనుకుంటుండగా.. ఆ పాత్ర కాదు అన్న విషయాన్ని నేరుగా అటు దర్శకుడు చెప్పేశాడు. కల్కి మూవీలో ప్రభాస్ నటించిన భైరవ పాత్ర కాదు.. అమితాబ్ నటించిన అశ్వద్ధామ పాత్ర తనకు ఎంతో ఫేవరెట్ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు మరో రెండు మూడు సంవత్సరాల్లో ఇక ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ 2 కూడా ఉంటుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: