ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి. ఎప్పుడు విభిన్నమైన సినిమాలను తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చే నాగ్ అశ్విన్ తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్లు అయితే సినిమా పై ఉన్న అంచనాలను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.


 హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నే రేంజ్ లో ఇక ఈ సినిమా ఉండబోతుంది అని అభిమానులు అందరూ కూడా అంచనాలు పెట్టుకున్నారు. కాగా నేడు ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు అందరూ కూడా అటు థియేటర్లకు బారులు తీరుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కూడా పూర్తయ్యాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ తో పాటు విజయ్ దేవరకొండ పాత్రలు కూడా ఉంటాయి అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే ఈ వీరి పాత్రలు ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.



 ఈ క్రమంలోనే ఇప్పటికే కల్కి మూవీ అటు ఓవర్సీస్ లో విడుదలవ్వగా ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర గురించి ఎన్నో రివ్యూలు కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తూ ఉన్నాయి. దుల్కర్ పాత్ర అదిరిపోయింది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అలాగే అమితాబ్, కమల్ యాక్షన్, యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంకోవైపు టాలీవుడ్ లోని ప్రముఖులందరూ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు అంటూ మురిసిపోతున్నారు.  ఇక ఈ సినిమాకి సంగీతం కూడా ప్రాణం పోసింది అంటూ చెబుతున్నారు. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సంతోష్ నారాయన్ మ్యూజిక్ అందించారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: