ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సినీ ప్రేక్షకులందరూ ఒకే మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా గురించి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరక్కిన ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను సర్ ప్రైస్ చేసే నాగ్ అశ్విన్ ఇక తన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కల్కి.


 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్లు ఇక సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా నేడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. దీంతో కల్కి సినిమా కోసం ఎన్నో రోజులుగా కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు అందరూ కూడా ఇక ఇప్పుడు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ఇక కొన్ని థియేటర్ల వద్ద ప్రభాస్ కి సంబంధించిన భారీ కటౌట్స్ దర్శనమిస్తున్నాయ్. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా ప్రభాస్ కటౌట్ లకి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇలాంటి సమయంలో ఇప్పటికే యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు కూడా పూర్తయ్యాయ్. ఈ క్రమంలోనే ప్రభాస్ కల్కి మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ మూవీలో ఏకంగా ప్రభాస్ ఎంట్రీ సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్  లైవ్ లో తెలిపారు. సినిమాలో తన ఫేవరెట్ క్యారెక్టర్ అమితాబ్ పోషించిన అశ్వద్ధామ అంటూ చెప్పుకొచ్చారు. మరో మూడున్నర ఏళ్లలో ఇక పార్ట్ 2 ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో కల్కి మూవీ క్లైమాక్స్ ప్రభాస్ ని సైతం ప్రైస్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీ చివర్లో వచ్చే పాట అందరికీ ఫేవరెట్ గా మారిపోతుంది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: