ప్రభాస్ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ ‘కల్కి’  నేడు (జూన్ 27) థియేటర్స్‌లో విడుదలైంది. భారత పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే ‘కల్కి’ అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగ్ అశ్విన్ . దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో.. హైటెక్నికల్ వాల్యూస్‌తో.. భారీతారాగణంతో.. ఈ చిత్రాన్ని నాలుగున్నరేళ్లు రూపొందించి నేడు థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇక ఈ మూవీ ఇప్పటికే యూఎస్‌తో పాటు.. అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితం


 కావడంతో.. ట్విట్టర్ వేదిగా అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు నేడు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాను విదేశాలతోపాటు.. పలు చోట్లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యారు. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని.. ఇక ఇంటర్వెల్ మెంటల్ లెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ వరల్డ్ క్లాస్ గా ఉంది. హాలీవుడ్ లెవల్ లో ఉంది. థియేటర్స్ లో తప్పక చూడాల్సిన కథ.. ఇంటర్వెల్ సినీ


 అదిరిపోయింది.. ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది.. సెకండాఫ్ కథ పుంజుకుంది. నాన్ కల్కి రికార్డ్స్ పక్కా, నార్త్ వాళ్లకైతే ఫస్టాఫ్ చాలు.. సెకండాఫ్ బోనస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇదిలవుండగా  క్యామియోల గురించి మాత్రం చాలా మంది రివీల్ చేయలేదు. ఎందుకంటే ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్సులకు చాలా ఆవశ్యకత ఉంది అంటున్నారు. వాటిని రివీల్ చేసి అందరి ఆసక్తిని తగ్గించకూడదు అనేది అభిమానుల ఆలోచన. అయితే రిలీజ్ కి ముందే ప్రభాస్ రెండు పాత్రలను లీక్ చేశాడు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కల్కి సినిమాలో ఉన్నారని ప్రభాస్ లీక్ చేశాడు. ఆ తర్వాత తప్పక నాగ్ అశ్విన్ కన్ఫామ్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు డార్లింగ్..!!


మరింత సమాచారం తెలుసుకోండి: