టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఎంతోమంది హీరోలు ఉన్న... హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు... అండదండలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ లాంటి బంపర్ హిట్ సినిమాతో.... కెరీర్ ప్రారంభించిన ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు.


ఇక లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన కల్కి... మూవీ ఇవాళ రిలీజ్ అయింది. ఎన్నికలు అయిపోవడం... ఇప్పుడు పెద్దగా సినిమాలు రాకపోవడంతో... కల్కి సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అయితే...  ఎంతోమంది స్టార్ నటి నటులు ఉన్న ఈ కల్కి  28 98 ఏడి... సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వస్తోంది. యూఎస్ లో ప్రీమియర్స్ తో పాటు మిగిలిన... ప్రాంతాల్లో కూడా... కల్కి సినిమాను ఎగబడి చూస్తున్నారు జనాలు.


ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.   ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం... చాలా ఓటిటి సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరికి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా.. హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.


కల్కి సినిమా థియేటర్లోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత... ఓటిటిలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన కల్కి సినిమా ఆగస్టు మొదటి వారంలో లేదా రెండో వారంలో స్ట్రీమింగ్ కానుంది. అయితే కల్కి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఎంత రేటుకు కొనుగోలు చేసింది అనే విషయం ఇంకా తెలియ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: