ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి సినిమా నేడు విడుదలైంది. ఇక మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ను దాదాపుగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో నిర్మించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇవాళ విడుదల అవ్వడంతో డార్లింగ్ అభిమానులు పెద్ద ఎత్తున పండుగ చేస్తున్నారు. డార్లింగ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈరోజు ఎంతో గ్రాండ్ గా విడుదల కావడంతో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

కల్కి విషయానికి వస్తే...

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే ఆమెతోపాటు  లెజెండ్ రీ యాక్టర్స్ అయిన అమితాబచ్చన్ కమలహాసన్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ముఖ్యంగా ఇందులో అమితాబచ్చన్ పాత్ర అత్యద్భుతంగా ఉంది అన్న టాక్ వినబడుతోంది. ఇక కల్కి సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇందులో ఆయన అశ్వద్ధామ అనే పాత్రలో కనిపించారు. అయితే ప్రస్తుతం ఆయనకి 81 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ప్రభాస్ కి ఏ మాత్రం తీసుకుపోకుండా సినిమాలో ఆయనకి పోటీగా నటించాడు. అంతేకాదు ఇందులో ప్రభాస్ మరియు అమితాబచ్చన్ ల మధ్య రెండు ఫైట్


 సన్నివేశాలు సైతం వస్తాయి. ఇక అందులో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అంతేకాదు ఒక సన్నివేశంలో హీరోయిన్ దీపికా పదుకొనే ను శంభాల అనే ఒక ప్రదేశానికి తీసుకువెళ్లడానికి ప్రభాస్ ప్రయత్నిస్తాడు. ఇక అందులో అశ్వద్ధామ గా నటించిన అమితాబచ్చన్ ప్రభాస్ ను అడ్డుకుంటాడు. అక్కడ కూడా వీరిద్దరి మధ్య వచ్చే ఫైట్స్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలా ఈ వయసులో కూడా అందరికీ షాక్ ఇచ్చే విధంగా యంగ్ హీరోలకి పోటీగా నటించాడు అమితాబచ్చన్. ఈ వయసులో ఇంత పెద్ద సాహసం చేశాడు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాతో అమితాబచ్చన్ క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: