టాలీవుడ్ లో మోస్ట్ అవైడల్ చిత్రంగా పేరుపొందింది కల్కి మూవీ.. ఈ చిత్రం ఎట్టకెలకూ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి తీసి ఉంటే కచ్చితంగా ఐదు బాహుబలి సినిమాలు తీసేవారు. అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలా ఎందుకు అన్నారు పూర్తి విషయాలు తెలుసుకుందాం.


ముఖ్యంగా బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర హైలెట్గా నిలిచింది.బాహుబలిని ఎందుకు చంపారు అనే విషయం పైనే.. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కి కీలకంగా మారింది. దాదాపుగా ఒక రెండేళ్ల పాటు ఈ ట్విస్ట్ రిలీవ్ కోసం ఎదురు చూసే అంతలా మారిపోయింది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే వాట్ ఇస్ ప్రాజెక్టు కే.. అనే విషయాన్ని సస్పెంచగానే ఉంచేశారు నాగ్ అశ్విన్. అలాగే 2898 విషయం కూడా ఏందనే అది సస్పెన్స్ గానే ఉంచారు. అయితే కమలహాసన్ పాత్ర చివరిలో వస్తుంది. ఆ పాత్ర వెనుక యొక్క అర్థం ఏమిటి అనే విషయాన్ని కూడా సస్పెన్స్ గాని వదిలేశారు.


ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రమే చూపించడం జరిగింది ఇందులో మహిళలు గర్భం దాల్చిన తర్వాత.. ఆ గర్భం నుంచి వెలువడే శక్తిని స్వాధీనం చేసుకుని వ్యక్తి లాగా.. అయితే అలాంటి శక్తిని అందించే అమ్మాయి కోసం వెతికే పాత్రలో కమలహాసన్ కనిపించినట్లు .. ఆడియన్స్ కి అనిపిస్తుంది.. కానీ దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో అనేది మాత్రం సస్పెన్స్ గానే వదిలేశారు. 81 సంవత్సరాల వయసులో అశ్వద్ధామ క్యారెక్టర్లు అమితాబ్ బచ్చన్ చాలా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వయసులో కూడా యాక్షన్ సన్నివేశాలలో ఆయన నటనకు ఎటువంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఒకవేళ ఇదే స్టోరీ రాజమౌళి అయ్యి ఉంటే మరింత అద్భుతంగా తీసేవారేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: