కల్కి..కల్కి.. కల్కి..ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి మూవీ హవానే నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD మూవీ పాన్ ఇండియా లెవెల్ లో హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో  దుమ్ము దులిపేశాడు దర్శకుడు.. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే  మన ఇండియాతో పాటు పలు దేశాలలో ప్రీమియర్ షోస్ పడ్డాయి.అలాగే ఈ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు,ఇతరులు ట్విట్టర్ వేదిక గా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.దీంతో సినిమా హిట్ అని చాలామంది రెబల్ స్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పేరు కల్కి మూవీతో మారిపోయింది అంటూ టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

మరి ఇంతకీ ప్రభాస్ మార్చుకున్న ఆ పేరు ఏంటి.. ఇప్పటినుండి ప్రభాస్ ని రెబల్ స్టార్ అని పిలవకూడదా.. ఇంతకీ ప్రభాస్ పెట్టుకున్న ఆ కొత్త పేరు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోని ఒక్కో పేరు పెట్టి పిలుచుకుంటారు.మెగాస్టార్,సూపర్ స్టార్, పవర్ స్టార్, ఐకాన్ స్టార్,స్టైలిష్ స్టార్, మ్యాచో స్టార్,ఎనర్జిటిక్ స్టార్, మాస్ మహారాజా ఇలా చాలామంది హీరోలకు పేర్లు ఉంటాయి.ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు.

అయితే తాజాగా కల్కి మూవీ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రభాస్ సినిమా ఏది విడుదలైనా సరే రెబల్ స్టార్ ప్రభాస్ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. కానీ ఈ మూవీలో రెబల్ స్టార్ కి బదులు "శ్రీ" ప్రభాస్ అని స్క్రీన్ పై వేశారు.దీంతో ప్రభాస్ రెబల్ స్టార్ ట్యాగ్ లైన్ మార్చుకొని "శ్రీ" ప్రభాస్ గా ఇప్పటినుండి పిలవబడతారు అని అభిమానులు భావిస్తున్నారు.ఇక ప్రభాస్ అభిమానులు ఆయనని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: