ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయిలో హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఈయన నటించి విడుదలైన చిత్రం కల్కి 2898 ఏడి థియేటర్లలో అదరగొడుతోంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ, ఇతర  నటీనటుల పాత్రలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగ్ అశ్విన్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే  ప్రీమియర్ షోలు రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. ట్విట్టర్ లో ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించి మాత్రమే వినిపిస్తోంది. సినిమా మొదటి భాగం నుంచి మొదలు క్లైమాక్స్ వరకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. ఈ విధంగా పురాణ ఇతిహాసాల నుంచి   తీసుకున్న ఈ చిత్ర స్టోరీని డైరెక్టర్ నాగ్ అశ్విన్, హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించారు. 

ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే  సినిమా చూస్తున్న వారికి సరికొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ ఉంటుందని కలలో కూడా ఊహించి ఉండరు అనుకోండి. మొదటి భాగంలో నటినటుల పాత్రలను  పరిచయం చేస్తూ స్లోగా కథను నడిపించిన నాగ్ అశ్విన్, ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక్కసారిగా విస్ఫోటనాన్ని  చూపించారు. మొదటి భాగంలో విజువల్స్ ఇప్పటికీ ఏ ఇండియన్ సినిమాలో చూడనంతగా ఉన్నాయి. ఇక సెకండ్ భాగంలో  యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అప్పుడే దీపికా పడుకునే ఎంట్రీ, యాక్షన్ సీన్ కూడా సెకండ్ హాఫ్ లో ఉంది.  

క్లైమాక్స్ విషయానికి వస్తే ఈ చిత్ర స్వరూపాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ని  అద్భుతంగా తీర్చిదిద్దాడు.  థ్రిల్లింగ్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ఎలాంటి మైనస్లు కనిపించకుండా సినిమాలు తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇక చివరి భాగంలో కల్కి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా సినిమా  క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు  తప్పక అనిపిస్తుంది. ఇలా సినిమా మొత్తం ఏమాత్రం తగ్గకుండా  అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్ తో రూపొందించారని చెప్పవచ్చు.  ప్రభాస్ అభిమానులకు ఈ చిత్రం ఒక పెద్ద పండగ లాగా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: