ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి కల్కి కల్కి... అనే మాట మాత్రమే వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన క‌ల్కి 2898 AD సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో... నాగ్ అశ్విన్... ఈ సినిమాను తీశారు. చాలా గ్రాండ్ గా... తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే అంతేకాకుండా దిశా పటానీ ఇలాంటి కీలక నటీనటులు ఉన్నారు.


వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్  లో ఈ క‌ల్కి 2898 AD సినిమాను తీశారు. అయితే..  ఎన్నో అనుమానాల నడుమ  కల్కి సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మహాభారతం తో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా... ఇందులో భైరవ దోస్తుగా బుజ్జి అనే స్పెషల్ రోబోటిక్ కారును.. చాలా హైలెట్ గా చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్.  

ఇక ఈ క‌ల్కి 2898 AD సినిమా యూఎస్ఏ లో మొదట రిలీజ్ కాగా మన ఇండియాలో...ఉదయం నుంచి షోలు ప్రారంభమయ్యాయి.ఈతరణంలోనే సినిమా బ్రహ్మాండంగా ఉందని పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ కు మంచి మార్కులు పడుతున్నాయి. క‌ల్కి 2898 AD సినిమాను హాలీవుడ్ రేంజ్ లో చూపించినట్లు తెలుపుతున్నారు. మార్వెల్ తరహాలో... కల్కి సినిమా తీసినట్లు ప్రశంసిస్తున్నారు.

350 కి పైగా షార్ట్స్ తీశారట. ప్రతి విజువల్ ఎఫెక్ట్... కల్కి సినిమాకు పాజిటివ్ అయిందని చెబుతున్నారు. ఒక తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి నాగ్ అశ్విన్ తీసుకువెళ్లినట్లు వెల్లడిస్తున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ ను చూపించడంలో... అలాగే అమితాబచ్చన్ లాంటి సీనియర్ నటినటుల పాత్రలను కూడా... అద్భుతంగా చూపించారట. పెద్దపెద్ద నటీనటులు ఉన్న నేపథ్యంలో అందరికీ సమానంగా స్క్రీన్ షేర్ చేయగలిగారట దర్శకుడు నాగ అశ్విన్. ఈ సినిమా మొత్తం... నాగశ్విన్ దర్శకత్వం పైన నడిచింది అని చెబుతున్నారు. కాగా  క‌ల్కి 2898 AD సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ కాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: