యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలిగే సినిమా నేడు విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది అయితే కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ భారీ అంచనాల నడుమ విడుదల చేసిన ఈ సినిమాలోని కొన్ని ట్రస్టులో సస్పెన్స్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

600 కోట్లకి పైగా బడ్జెట్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సింపుల్‌గా చెప్పాలంటే ఇదీ 'కల్కి 2898 ఏడీ' సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ ప్రేక్షుకలకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. అయితే ఈరోజు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. సినిమా చాలా బాగుంది అని.. ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ


 ప్రేక్షకులను చాలా ఓపిగ్గా కూర్చోబెట్టి చూపించారు అని.. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అత్యద్భుతంగా ఉంది అని.. అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా పెద్దగా లేదు కానీ క్లైమాక్స్ లో మాత్రం ఆఖరి 30 నిమిషాలు వేరే ప్రపంచానికి తీసుకువెళతాడట డైరెక్టర్. మనం తెలుగు సినిమా కాకుండా హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. అయితే కల్కి సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఇప్పుడు విడుదల చెయ్యగా రెండో భాగం ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. అయితే మొదటి భాగంలో అంతా  సస్పెన్స్ లో ఉంచాడు డైరెక్టర్. గతంలో వచ్చిన బాహుబలి సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. ఏంటంటే.. బాహుబలి స్టోరీ మొత్తం కూడా పార్ట్ 2 లోనే

 ఉంటుంది. అయితే ఇక్కడ కూడా అదే జరుగుతోంది. కల్కి లో పెద్దగా మ్యాటర్ లేదు. పూర్తి మేటర్ అంతా 2 లోనే ఉండబోతోంది. అసలు ప్రాజెక్ట్ k అంటే ఏంటి.. 2898 అర్థమేంటి అన్నది మొత్తం కూడా పార్ట్ టూ లోనే ఉండిబోతుంది. అలాగే ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ పాత్ర సెకండ్ హాఫ్ చివరిలో ఉంటుంది. అసలు కమల్ హాసన్ పాత్ర ఏంటి అన్నది కూడా సస్పెన్స్ లోనే పెట్టాడు డైరెక్టర్.  మొత్తానికి  చాలావరకు క్యారెక్టర్స్ ను సస్పెన్స్ లో పెట్టిన డైరెక్టర్ పార్ట్ 2 లో ఆ క్యారెక్టర్స్ ను ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: