ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కల్కి మూవీ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి మూవీకి సంబంధించిన వార్తలే వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ఇందులో ప్రభాస్ దీపిక  పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మొదలు మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, సీనియర్ నటి శోభన, దుల్కర్ సల్మాన్ , బ్రహ్మానందం, రాంగోపాల్ వర్మ, రాజేంద్రప్రసాద్ వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఉన్నారు.. ఇక ఈ మూవీలో  ప్రస్తుతం అందరూ అమితాబ్ బచ్చన్,ప్రభాస్ ల మధ్య వచ్చిన ఫైటింగ్ సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారట.

  ఎందుకంటే ప్రభాస్ యంగేజ్ లో ఉన్నారు. ఎలాంటి యాక్షన్ సీన్ అయినా చేయగలరు. కానీ అమితాబ్  బచ్చన్ కి 80 ఏళ్ల వయసు దాటిపోయింది.ఇక అలాంటి అమితాబ్, ప్రభాస్ తో ఏం ఫైటింగ్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న ఫైటింగ్ సన్నివేశాలను చూస్తే ప్రభాస్ ఎనర్జీ కి ఏమాత్రం తీసిపోకుండా అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ లో దుమ్ము లేపేసారు. ఇందులో ప్రభాస్ భైరవ పాత్ర పోషిస్తే అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ఫైటింగ్స్ సన్నివేశాలు అందర్నీ ఆకర్షించాయి. ఇక వీరి మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ చూడడానికి రెండు కళ్ళుసరిపోవు అనేంతలా సీన్స్ ఉన్నాయి.

ఇక హీరోయిన్ దీపికా పదుకొనేను శంబలా నగరానికి ప్రభాస్ తీసుకుపోయే సమయంలో అశ్వద్ధామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్  ప్రభాస్ ని అడ్డుకునే సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక వీరిద్దరి ఫైటింగ్ సన్నివేశాల గురించి రీసెంట్ గా అశ్వద్ధామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ కల్కి మూవీలో ప్రభాస్ తో ఫైటింగ్ సన్నివేశాల్లో కాస్త కఠినంగా చేశాను. ప్రభాస్ అభిమానులు అందరూ నన్ను క్షమించాలి అంటూ చేతులు జోడించి అమితాబ్ బచ్చన్ క్షమాపణలు కోరిన సంగతి మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: