ఎట్టకేలకు కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఐదేళ్లుగా నిరీక్షణకు ఈ రోజున తెరపడింది .. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు కల్కి సినిమా రానే వచ్చేసింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో భారీ హైప్ తోనే విడుదలై మంచి సక్సెస్ను అందుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ విడుదలకు ముందు నుంచే ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన వాహనాలను తయారు చేశారనే విధంగా వార్తలు వినిపించాయి. అలాగే ట్రైలర్లో బుజ్జి అనే ఒక వాహనాన్ని కూడా చూపించారు. ఈ సినిమాకి ఇదే స్పెషల్గా ఉన్నట్టుగా తెలుస్తోంది .



ఈ బుజ్జి వాహనాన్ని ప్రభాస్ తయారు చేసినట్టుగా సినిమాలో చూపించారు. ఇలా తయారుచేసిన వాహనాన్ని మధ్యలో అమితాబచ్చన్ ఎన్నోసార్ ఫైటింగ్లో ధ్వంసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నిసార్లు విధ్వంసం చేసిన బుజ్జిని రిపేర్లు చేసుకుని భైరవ పాత్రలో ప్రభాస్ వస్తూనే ఉంటారు. క్లైమాక్స్ ఫైట్ కి ముందుకి కూడా బుజ్జిని నాశనం చేస్తే.. వాటిని రిపేర్ చేసుకుని మరి శంబాలా కి వెళ్తారు.. ముఖ్యంగా బుజ్జి చెప్పే సూచనలతో ప్రభాస్ వెళుతూ ఉంటారు. వాహనంలో మిక్కీమౌస్ లో ఉండేటువంటి వాటితో ప్రభాస్ మాట్లాడుతూ ఉంటారు.


సినిమాలో ఏదైనా కామెడీ ఉందంటే అది బుజ్జి, ప్రభాస్ మధ్య జరిగిన సన్నివేశాలు అని చెప్పవచ్చు. చిన్న చిన్న కామెడీ డైలాగులు కూడా చూపించారు. ప్రభాస్ చేసింది కూడా ఈ ఒక్కటే ఇలా దీంతోనే కామెడీని పండించడం జరిగింది. ముఖ్యంగా భైరవకు కూడా ఎప్పటికప్పుడు సూచనలను ఇస్తూ ఉంటుంది బుజ్జి.. అటు ఒకవైపు వాహనంగా పనిచేస్తూనే మరొకవైపు మాటలతో అడాప్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ బుజ్జి వెహికల్ కోసం రూ .4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది నిర్మాత అశ్వని దత్.. అంతేకాకుండా చాలావరకు రియలిస్టిక్ గా ఉండే విధంగానే అన్నిటిని తీసుకురావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: