నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కిని రూపొందించారు. ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్స్‌ నటించడంతో ఈ చిత్రంపై ముందు నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు కల్కి రిలీజ్ అయింది.  భారతీయుల ఇతిహాసం మహాభారతంలోని కొన్ని అంశాలను కలియుగానికి లింక్ చేస్తూ.. శ్రీమహావిష్ణువు చివరి అవతారం కల్కి అవతరించే సమయంలో చోటు చేసుకునే పరిణామాలను

 ఊహిస్తూ నాగ్ అశ్విన్ ఈ విజువల్ వండర్‌ను సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించారు. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో పది అవతారాలను దశావతరాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన , పరుశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు.. ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి. అంటే శ్రీమహా విష్ణువు పదవ అవతారమే ఈ కల్కి అన్నమాట. అయితే కల్కి ఎవరు అన్న విషయాన్ని పక్కన పెడితే ఇందులో హీరోయిన్ గా నటించినా దీపిక పదుకొనే పాత్ర ఇందులో చాలా అత్యద్భుతంగా ఉంది.

 మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను దీపిక పదుకొనే కి ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఇందులో భర్త లేని ఒక గర్భవతి పాత్రలో కనిపిస్తుంది దీపికా పదుకొనే. కల్కి లోని  కాంప్లెక్స్ అనే ఒక ప్రపంచంలో బందీగా ఉంటుంది దీపిక. తల్లి అవ్వాలి అన్న  కోరికతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అదే గర్భంతో ముందుకు వెళుతూ ఉంటుంది.  ఇక అదే సమయంలో తనకు పుట్టబోయే బిడ్డ కోసం శంబాల ప్రపంచం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ మధ్యలోనే సినిమాలో తనకి ఎన్నో మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. మధ్యలో అమితాబచ్చన్ వచ్చి తనని కాపాడడం అలా ఎన్నో రకాల సన్నివేశాలు ఉంటాయి. కానీ దిశ పటానికి మాత్రం అలా కాదు. ఎక్కడో ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప సినిమాలో పెద్దగా కనిపించదు.  కానీ దీపిక మాత్రం సినిమా మొదటి నుండి ఆకరి వరకు ఉంటుంది. ప్రభాస్ దీపిక ల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: