యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కల్కి 2898 AD “..ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..  కొద్దిసేపటి క్రితమే ఈ విజువల్ వండర్ థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఊహించని అంచనాలతో రిలీజ్ అయిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద  పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ప్రభాస్ ను వారు ఎలా చూడాలనుకున్నారో ఆ రేంజ్ ఎలివేషన్స్ తో చూపించి డైరెక్టర్ నాగ అశ్విన్‌ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు..అలాగే సినిమాలో హీరోయిన్‌లుగా దీపికా పదుకోన్, దిశా పటాని ఎంతగానో అలరించారు. ఈ సినిమాలో దీపికాను కేవలం గ్లామర్ కోసం వాడకుండా కథలో భాగం చేసి తన అద్భుతమైన నటనకు స్కోప్ ఇచ్చారు. అలాగే దిశా పటాని సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.. 

ఇక  ఈ సినిమాలో  అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు..భైరవా(ప్రభాస్‌)ల, అశ్వద్దామా మధ్య జరిగే యాక్షన్స్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి..నాగ అశ్విన్ ప్రభాస్, అమితాబ్ ను చూపించిన తీరు అద్భుతం అని ప్రేక్షకుల నుండి కామెంట్లు వినిపించాయి.ఫైట్ సీన్స్‌లో ఇద్దరికీ నాగ్ అశ్విన్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కమలహాసన్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో.. ఎంత భయంకరంగా ఉంటాడో ఈ సినిమాల్లో కమల్ హాసన్ పాత్రను తీర్చిదిద్దాడట నాగ్ అశ్విన్‌.హాలీవుడ్ స్థాయిలో గ్రేట్ విజువల్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమా కథ పరంగా గూస్ బంప్స్ తెప్పించిన నచ్చినా బిజిఎం పరంగా మాత్రం అభిమానుల్లో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అస్సలు అసలు వర్కౌట్ కాలేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: