ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్, ప్రభాస్ అనే నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయ్. ఎందుకంటే సినీ ప్రేక్షకులు అందరూ కూడా కల్కి మూవీ చూడటంలో బిజీబిజీగా ఉన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. దేశ విదేశాల్లో ఉన్న భారత సినీ ప్రేక్షకులు కూడా ఈ మూవీకి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లో సినిమా చూడ్డానికి వెళుతున్న ప్రేక్షకులు.. నాగ్ అశ్విన్ సృష్టించిన ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లి ఆశ్చర్యపోతున్నారు. నిజంగా తాము చూస్తుంది తెలుగు సినిమా నేనా అని అనుమానం వచ్చేలా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు ఫిదా అయిపోతున్నారు.


 మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ జోడించి ఇక తన విజన్ తో నాగ్ అశ్విన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ మూవీలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక కీలకపాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్మ ఏ పాత్రలో నటించాడు అని తెలుసుకోవడానికి ఆయన అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూసారు. విడుదలైన తర్వాత సినిమా చూసి వర్మ పాత్రతో అభిమానులు సర్ప్రైజ్ అయిపోతున్నారు.


ఎందుకంటే ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ  ప్రభాస్ కి గుడ్డు అమ్మాడట. ఈ సినిమా మొత్తం కాంప్లెక్స్ కి వెళ్లాలని ప్రభాస్ అనుకుంటూ ఉంటాడట. దీనికోసం యూనిట్స్ అవసరం కాగా.. ఇక పదివేల యూనిట్స్ సంపాదించుకోవడం క్రమంలో రాంగోపాల్ వర్మను కలుస్తాడట నీకు ఒక అపురూపమైన వస్తువును ఇస్తాను ఐదువేల యూనిట్లు కావాలని అడగడంతో.. ప్రభాస్ ఆ మాట నమ్మి ఆర్జీవికి 5 యూనిట్స్ ఇచ్చి బాక్స్ లో పెట్టిన ఒక అపురూపమైన వస్తువును కొంటాడట. పక్కకు వెళ్లి చూస్తే అది కోడుగుడ్డు. దీంతో మోసపోయానని ప్రభాస్ గమనిస్తాడట. ఇలా వర్మ సినిమాలో గెస్ట్ అఫీరియన్స్ పాత్రలో ప్రభాస్ కు ఏకంగా గుడ్డుని అమ్మేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: