కల్కి.. కల్కి.. కల్కి.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ మూవీ గురించే చర్చ జరుగుతుంది  కేవలం మన ఇండియాలోనేనా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీ ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచి ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా విడుదలకు ముందు విడుదలైన ట్రైలర్లు మాత్రం ఈ మూవీ పై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.


 ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా నటించగా.. అటు అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి ఎంతోమంది లెజెండరీ నటులు కూడా కీలకపాత్రలు పోషించారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఈ సినిమా విడుదల అవ్వగా.. సినిమా రివ్యూ ఎలా ఉంటుంది అనే విషయంపై అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే అఫీషియల్ గా ప్రకటించిన పాత్రలు కొన్ని ఉన్నప్పటికీ అనఫీషియల్ అయిన అంటే రహస్యంగా ఉంచిన కొంతమంది స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అన్నది తెలుస్తుంది.


బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్ , రాజ‌మౌళి, రాంగోపాల్ వ‌ర్మ‌ లాంటి పాత్రలు సినిమా చూస్తున్న ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. గెస్ట్ పాత్రలో నటించిన అందరికి అప్పులు పెట్టి ప్రభాస్ ఎగుడుతూ ఉంటాడట. ఇక బ్రహ్మానందం ఇంట్లోనే రెంట్ కు ఉంటూ ప్రభాస్ రెంటును కూడా ఎగుడుతూ ఉంటాడట. వీరి మధ్య మంచి సన్నివేశాలు బాగుంటాయట. ఇలా కల్కి సినిమాలో గెస్ట్ రోల్స్ చాలా ఉన్నాయి. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాయి. కానీ ఇలాంటి గెస్ట్ రోల్స్ సినిమా కథపై మాత్రం ఎలాంటి చూపించడం లేదట. అయితే ఇలాంటి స్టార్స్ ని పెట్టుకుని ఇక నాకు అశ్విన్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు అంటూ టాక్ వినిపిస్తోంది. మరి ఇది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: