టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం కల్కి.. ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ కాస్ట్యూమ్స్ భారీ బడ్జెట్ విఎఫ్ఎక్స్ వల్ల మంచి హైపర్ ఏర్పడింది.. ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం ఇందులో నటిస్తూ ఉండడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. ముఖ్యంగా ఇందులో కమలహాసన్ ని విలన్ గా చూపించారని వార్తలు కూడా వినిపించాయి ట్రైలర్ లో కూడా అదే విధంగా కనిపించడం జరిగింది. కానీ సినిమాలో వచ్చేసరికి కమలహాసన్ కి పెద్దగా టైమింగ్స్ స్కోప్ ఇవ్వలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా కమలహాసన్ గెటప్ కూడా ఇందులో విభిన్నంగా ఉన్నది. ఈ మేకప్ కోసం హాలీవుడ్ నుంచి తీసుకువచ్చి మరి వేయడం జరిగిందట. ప్రముఖ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మేకప్ మ్యాన్లను తీసుకువచ్చి మరి కమలహాసన్ కు మేకప్ వేయించారు. మేకప్ అయితే చూడడానికి భయంకరంగా ఉన్నది... అయితే కమలహాసన్ అంతటి పాత్ర అందులో వెలివేషన్ మాత్రం పెద్దగా చూపించలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో కమలహాసన్ అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



ముఖ్యంగా కమలహాసన్ పాత్ర క్లైమాక్స్ లో వస్తుంది. దీపికా పదుకొనే పాత్ర కోసం తానే వెళ్ళబోతున్నానని చెబుతూ ఉంటారు.. కల్కి సినిమా సీక్వెల్ని సైతం కొనసాగింపు ఉంటుందనే విధంగా కమలహాసన్ ఎండింగ్లో చూపించడం జరిగింది. బహుశా సెకండ్ పార్ట్ లో కమలహాసన్ పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందేమో అని పలువురు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే కల్కి సినిమా మేకప్ విషయంలో కాస్త ఎక్కువగా చేసినప్పటికీ మాటలు విషయంలో చాలా తక్కువగా చూపించారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కల్కి సీక్వెల్ విషయాన్ని చిత్ర బృందం ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి. ప్రభాస్ కూడా ఇందులో ఎక్కువ నిడివి లేదని తెలుస్తోంది. అయినప్పటికీ తన పాత్రకి తగ్గ న్యాయం చేశారని అశ్వద్ధామగా అమితాబచ్చన్ అదరగొట్టేసారని దీపికా పదుకొనే కూడా అద్భుతంగా నటించిందని తదితర హీరోలు కూడా అద్భుతంగా నటించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: