ప్రస్తుతం భారత సినిమా ప్రపంచం మొత్తం ఒకే సినిమా గురించి మాట్లాడుతున్నారు. అదే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన  కల్కి మూవీ గురించి. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ee మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ ఇక బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే దిశా పటాని లాంటి వాళ్ళు నటించారు.


 అయితే అఫీషియల్ గా ప్రకటించింది వీళ్ళ పేర్లే అయినప్పటికీ.. ఇక ఈ మూవీలో అభిమానులు అందరిని కూడా సర్ప్రైజ్ చేసే పాత్రలు ఎన్నో ఉన్నాయి అన్నది ఇక ఇప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా టికెట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూసిన అభిమానులు.. టికెట్స్ విడుదల అయ్యాయో లేదో వెంటనే బుక్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ని చూసేందుకు థియేటర్లకు బారులు తీరారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే కల్కి సినిమాకు సంబంధించిన రివ్యూలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి.


 అయితే సినిమా ప్రారంభమే ఏకంగా ఎంతో గ్రాండ్ గా ఉందని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మహాభారత ఘట్టాన్ని వివరిస్తూ సినిమాని మొదలుపెట్టిన తీరు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రాండ్ ఫిలిమ్ మేకింగ్ కి కల్కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ మూవీ ముందు హాలీవుడ్ సినిమాలు కూడా పనిచేయవు అని చెబుతున్నారు. ఇలా ఓపెనింగ్ బ్లాస్ట్ అవ్వగా.. విజువల్స్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగాయట. కానీ కొన్ని చోట్ల మాత్రం సీన్స్ బాగా సాగదీతగా ఉన్నట్లు  టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ ని 180 నిమిషాలు పెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించాడట. ఈ సమయాన్ని కొంత కట్ చేసి పెట్టుకుంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకుంటున్నారట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందట. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల ఊహకందని రీతిలో అదిరిపోయింది అన్నది తెలుస్తుంది. మొత్తంగా కల్కి మూవీ ఇక రికార్డులు తిరగరాసేలాగే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: