ప్రభాస్ కథానాయకుడిగా రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలనాటి అందాల నటి శోభన ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మూడు ప్రపంచాల మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అయితే కల్కి 2898 ఏడీ సినిమా కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది. భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి, నిర్జీవమైన దశలో ‘కాశీ’ పట్టణాన్ని చూపించారు. అన్ని వనరులు ఉండే ఆకాశం కోసం.. కిలోమీటర పరిధిలో కాంప్లెక్స్‌ను డిజైన్‌ చేశారు. సర్వమతాలకు చెందిన శరణార్థులు ఉండే ప్రపంచంగా ‘శంబల’ను చూపించారు. వీటి ఔట్‌ లుక్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌‌లో చూపించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించారని సమాచారం.

ఆ మూడు ప్రపంచాలు ఇవే..

కల్కి సినిమా కాశి కాంప్లెక్స్ షంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ. ప్రపంచంలోని ఆఖరినగరం అయిన కాశీలో గంగానది ఎండిపోయిన సమయంలో అక్కడి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తారు అన్నది చూపిస్తారు. అన్ని సౌకర్యాలు ఉన్న కాంప్లెక్స్ కు కాశి ప్రజలు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే శంభాల అనే నగరం నుండి ఎప్పుడు కాంప్లెక్స్ పై దాడి జరుగుతూనే ఉంటుంది. ఇక కాశీలో ఉండే ప్రజలు తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక విలవిలలాడుతూ ఉంటారు. ఇక దాన్ని అలుసుగా తీసుకున్న కాంప్లెక్స్ వారు ఈ కాశి ప్రజలను వారి అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు.


అక్కడ పనులు చేయించుకోవడానికి ఇతర అవసరాల కోసం కాశీ ప్రజలను కాంప్లెక్స్ కి తరలిస్తూ ఉంటారు. కాంప్లెక్స్ వాళ్ళు చేసే కొన్ని ప్రయోగాల కోసం కాశి ప్రజలను తీసుకువెళ్లాలి అనుకుంటారు. అదే ఒకవేళ కాంప్లెక్స్ కి వెళ్ళాలి అంటే కాశి ప్రజలు కచ్చితంగా మిలియన్ యూనిట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా కల్కి మూడు ప్రపంచాలకి సంబంధించిన కథ కొనసాగుతూ ఉంటుంది. వెళ్లే కొద్దీ కథ మరింత ఎక్సైటింగ్ తో కూడి ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: