ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ సినిమా 'కల్కి 2898 ఏడీ'కి ఓవర్సీస్ నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తోంది.క‌మ‌ల్‌హాస‌న్‌  అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకోణ్  కీల‌క పాత్ర‌లు పోషించారు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై నిర్మాత అశ్వ‌నీద‌త్‌ దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో కల్కి 2898 ఏడీ మూవీని తెర‌కెక్కించాడు. విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? ప్ర‌భాస్ సినిమాతో హిట్ కొట్టాడా? లేదా? అంటే… గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ మాయ‌లో క‌ల్కి క‌థే ప‌లుచబ‌డిన ఫీలింగ్ క‌లుగుతుంది.

 తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను ఒక్క పార్ట్‌లో కంప్లీట్ చేయ‌డం సాధ్యం కాద‌ని ముందే నాగ్ అశ్విన్ ఫిక్స‌య్యాడు. అందుకే క‌ల్కి 2898 ఏడీ పార్ట్ 1 సినిమాను కేవ‌లం పాత్ర‌ల ప‌రిచ‌యానికే ఉప‌యోగించుకున్నాడు. కంప్లెక్స్‌, శంబాలా వ‌ర‌ల్డ్‌ల‌ ప‌రిచ‌యం, భైర‌వ‌, అశ్వ‌త్థామ‌తో పాటు మిగిలిన క్యారెక్ట‌ర్స్ ఎలా ఉంటాయి, వారి నేప‌థ్య‌మేమిటి అన్న‌దే ఈ సినిమాలో చూపించాడు. కంప్లీట్ ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో సినిమాను న‌డిపించాడు. ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ బాగుంది. మొత్తానికైతే కల్కి ఎవరేజ్ టాక్ అందుకుంది అని చెప్పాలి.

 ఎందుకంటే భారీ అంచనాల నడుమ విడుదల చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని అంటున్నారు. ఇక మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. టీజర్ ట్రైలర్ అప్డేట్స్ అన్ని విడుదల చేస్తూ  సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేశారు. కానీ థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూసిన తర్వాత అంత గొప్పగా అనిపించలేదు అని చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు  ఫస్ట్ ఆఫ్ కొద్దిమేరకు బోరింగ్ గా ఉంది అని.. ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్యాంక్ బావుంది అని అంటున్నారు. అలాగే సెకండ్ హాఫ్ కొద్ది వరకు పరవాలేదు అని.. కానీ లాస్ట్ 30 నిమిషాలు మాత్రం సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే సినిమా అని అంటున్నారు. మొత్తానికి కల్కి సినిమాతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నాడు ప్రభాస్. మొత్తానికి అయితే ఈ సినిమాకి 100 కి 50 నుండి 55 మార్కుల వరకు వెయ్యొచ్చు అని అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: