యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం "కల్కి 2898 AD", ఎట్టకేలకు థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా కొన్ని దేశాల్లో ఆల్రెడీ రిలీజ్ కాగా దీన్ని చూసిన చాలా మంది రివ్యూలు చెప్పేస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది సినిమాలో క‌ళ్లు చెదిరే విజువల్స్ ఉన్నాయని, సినిమా సూపర్ హిట్ చేయడంలో ఈ విజువల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు.

మహాభారత పాత్రలతో  ఆకట్టుకునే స్టంట్స్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది ప్రేక్షకులు స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉందని , ప్రభాస్ కు స్క్రీన్ టైమ్ లిమిటెడ్ గా ఉందని నిరాశ వ్యక్తం చేశారు. ప్రముఖ విమర్శకుడు వెంకీ రివ్యూస్, కల్కి సినిమాలో విజువల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని పేర్కొన్నారు. మూవీ సెటప్ అద్భుతంగా ఉందని అన్నారు. ఫస్టాఫ్ "పాసబుల్" అని అభివర్ణించారు, అయితే స్క్రీన్‌ప్లే, బాగోలేదని ప్రభాస్ పెద్దగా కనిపించలేదని పెదవి విరిచారు.

కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, "కల్కి 2898 AD"లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, స్టంట్స్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుందని స్పష్టంగా తెలుస్తోంది. ట్విట్టర్‌లో మరో ప్రముఖ క్రిటిక్ శ్రీనివాస కుమార్, సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను ప్రశంసించారు, ఇంటర్వెల్ క్లైమాక్స్‌ మరో ప్రపంచంలోకి ప్రయాణంగా ఉంటుందని అభివర్ణించారు. ఈ చిత్రంలో లాంటి విజువల్ ఎఫెక్ట్స్‌ భారతీయ సినిమాలో చాలా అరుదుగా కనిపిస్తాయని అన్నారు. ఇండియన్ విజువల్ ఎఫెక్ట్స్ ను చాలా ఎత్తుకు కల్కి సినిమా తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

ఈ మూవీలో క్రీ.శ. 2898లో కాశి నగరం సృష్టి ప్రత్యేకంగా నిలుస్తుంది, కొన్ని ఇళ్లు, ఇంటీరియర్స్, ల్యాండ్‌స్కేప్‌లు భవిష్యత్ అంశాలను పౌరాణిక ఇతివృత్తాలతో మిళితం చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. మంచి విజువల్స్ తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లతో కూడిన ఎమోషనల్ సీన్లు బాగా ఆకట్టుకున్నాయని అంటున్నారు. ప్రత్యేకించి, భైరవ పాత్ర కలియుగ రక్షకుడైన కల్కిగా మారడం గూస్ బంప్స్ తెప్పించిందని అంటున్నారు. మంచి క‌థ‌కు మంచి విజువల్స్ చూడయ్యాయి కాబట్టి ఈ మూవీ తిరుగులేని విషయం సాధిస్తుందని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: