పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీకల్కి 2898 AD “. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ మైథలాజికల్ కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించాడు..వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ ఈ సినిమాను దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన  రిలీజ్ ట్రైలర్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. దీనితో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడని విజువల్స్ అదిరిపోయాయని చెప్పుకోస్తున్నారు. 

సినిమా నిడివి ఏకంగా 3 గంటల 1  నిమిషం వుంది. అంత సేపు వున్నా ప్రేక్షకులకు సినిమా అసలు బోర్ కలగించలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లీనం అవుతామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా, దిశా పటాని, అమితాబ్, కమల్ పాత్రలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని వారికీ ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్ ఉంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ పరంగా అద్భుతమని అందరూ చెబుతున్నారు. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించి చిన్న మిస్టేక్ చేసారు. ఈ సినిమా ప్రమోషన్స్ పై నాగ్ అశ్విన్ అంతగా దృష్టి పెట్టలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి ఏ విధంగా ప్రమోట్ చేసాడో మనకి తెలిసిందే. ఈ సినిమా దాని కంటే అద్భుతంగా వుంది. మరి ఈ సినిమాకు ప్రమోషన్స్ అంతగా లేకపోవడం మైనస్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: