సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ 'రెబల్ స్టార్' ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా ఎట్టకేలకు నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యంగ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటని లాంటి ఫేమస్ స్టార్స్‌ నటించడంతో కల్కి 2898 AD మూవీపై మొదటి నుంచి కూడా ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు సినిమాపై మరింత హైప్‌ ని క్రియేట్‌ చేశాయి. ఈరోజు రిలీజ్ అయిన కల్కి సినిమా టాక్ సోషల్ మీడియాలో  మాములుగా లేదనే చెప్పాలి. ఒక రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఇక అమెరికాలో అయితే ఇప్పటికే పలు షోలు పూర్తవగా.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే కల్కి 2898 ఏడీ స్పెషల్‌ షోలు పడిపోయాయి.ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నెట్టింట తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 


కల్కి సినిమా సూపర్ అంటున్నారు. ముఖ్యంగా రెండో భాగం అరాచకం అంటున్నారు. ఇది పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అంటున్నారు. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని . ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేయొచ్చని నెటిజన్స్ అంటున్నారు. ఈ సినిమాలో మంచి కథ, అశ్వథామ, క్లైమాక్స్ బాగున్నాయి. మొదటి భాగం నుంచి రెండో భాగం దాకా అంతా చాలా బాగుంది. నిజానికి మన భారత దేశ చరిత్ర చాలా గొప్పది. మన చరిత్రలో ఎన్నో నిజమైన కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో ఈ కల్కి కథ కూడా ఒకటి. ఇలాంటి కథని పెట్టుకొని మన డైరెక్టర్లు సినిమాగా తీయకుండా పనికిమాలిన రొటీన్ స్టోరీలని తీస్తున్నారు. ఈ రోజుతో ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ డైరెక్టర్లకి నిజమైన ఇండియన్ సినిమా ఏంటో చూపించాడు. సినిమా అంటే ఇలా తీయాలి. మనం హాలీవుడ్ కి ఏమాత్రం తక్కువ కాదనే విషయాన్ని నాగ్ అశ్విన్ ఈ సినిమాతో నిజం చేసి చూపించాడు. నిజంగా ఈ కల్కి అనేది మన నిజమైన భారత దేశ కథ. ఇలాంటి కథలు కుప్పలు కుప్పలుగా మనకి ఉన్నాయి. ఇలాంటి కథలు మన డైరెక్టర్ లు తీస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: