ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడి అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. టీజర్, ట్రైలర్ తో సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడడంతో సినిమాకి ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది.  వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై నిర్మాత అశ్వ‌నీద‌త్‌

 దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో కల్కి 2898 ఏడీ మూవీని తెర‌కెక్కించాడు.  మహాభారతంతో ముడిపెడుతూ ఇంట్రెస్టింగ్ ఐడియాతో నాగ్ అశ్విన్ క‌ల్కి  క‌థ‌ను రాసుకున్నారు. సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్ కూడా పురాణాల స్ఫూర్తితోనే సాగుతుంటాయి. మోడ్ర‌నైజేష‌న్‌తో పాటు పురాణాల్ని రెండింటిని మిక్స్ చేసి అర్థ‌వంతంగా చెప్ప‌డం అంటే క‌త్తిమీద సాము లాంటిదే. కానీ ఈ ప్ర‌య‌త్నంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. అశ్వ‌త్థామ‌కు కృష్ణుడు విధించిన శాపం, మ‌హాభార‌తంలో మ‌రో కీల‌క పాత్ర‌తో హీరోకు ఉన్న సంబంధాన్ని క‌న్వీన్సింగ్‌గా

 రాసుకున్నాడు. కీల‌క పాత్ర‌ల తాలూకు నేప‌థ్యాల‌ను డీటైలింగ్‌గా రాసుకోవ‌డం బాగుంది. మొత్తానికి కల్కి సినిమాతో విజువల్ వండర్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే అత్యద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత నుండి అందరికీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అంతేకాదు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సెకండ్ హాఫ్ తర్వాత కాలర్ ఎగరవేసుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.  సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. మన తెలుగు సినిమా స్టామినాను బాహుబలి సినిమా తర్వాత ఆ సినిమా కంటే మించి కల్కి తో నిరూపించాడు డైరెక్టర్. మొత్తానికి ఈ సినిమాతో  భారీ విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నాగ్ అశ్విన్ టేకింగ్ కి అందరూ హాండ్సఫ్ చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: